![]() |
![]() |
.webp)
గుప్పెడంత మనసు సీరియల్ ఫీవర్ ఆడియన్స్ లో చాలా ఉంది. ఆ సీరియల్ లో డిబిఎస్టి కాలేజీకి మంచి పేరు వచ్చింది. ఆ కాలేజీ వాతావరణం కూడా ఫుల్ ఫేమస్ అయ్యింది. విశాలమైన ప్రాంతంలో కొంతమందే స్టూడెంట్స్ ఉండడం. చుట్టూ చెట్లు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రిషి, మహేంద్ర, జగతి కార్లు అక్కడికి వేసుకుని రావడం . ఇక వసు, రిషి కాలేజీ మెట్ల మీద చెట్ల కింద , గట్ల మీద కూర్చుని ప్రేమ పాఠాలు చెప్పుకుంటూ ఉండడం. అలాంటి కాలేజీ గురించి ఆ సీరియల్ ఫాదర్ మహేంద్ర భూషణ్ ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ చెప్పాడు. ఈ కాలేజీ సుమారు 25 టు 30 కోట్లు ఉంటుందట..కానీ అతి తక్కువలో అంటే సుమారు రెండున్నర కోట్లకు అమ్మేస్తే తాను కొనుక్కున్నట్లు చెప్పాడు. అంత కాస్ట్లీది తక్కువకు దొరికేసరికి కొనేసుకుని చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పాడు.
ఇంత మంచి ఆపర్చ్యునిటీ అందరికీ దొరకదుగా అనేసరికి మహేంద్ర భూషణ్ వెనక నుంచి ఒక దెయ్యం ఒక తెల్లటి వస్త్రాలు ధరించి అలా నడిచి వెళ్ళిపోయింది. ఆ సీన్ తో మహేంద్ర భూషణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత అక్కడ దెయ్యం నవ్వులు వినిపించాయి. దొంగ సచ్చినోళ్ళు దెయ్యాలున్న కాలేజీ కాబట్టి తక్కువకు ఇచ్చేసారు అని తిట్టుకుంటూ భయపడుతూ హనుమాన్ చాలీసా చదువుకుంటూ బయటకు పరిగెత్తుకొచ్చాడు. ఈ వీడియోని మహేంద్ర తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. అదిప్పుడు ఫుల్ వైరల్ గా మారింది. ఇక నెటిజన్స్ ఐతే "సూపర్ సర్, కాలేజీతో పాటు దెయ్యం కూడా ప్రీ...సర్ మీరు దెయ్యాన్ని రెండున్నర కోట్లు పెట్టి కొన్నారా... కాలేజీని కొన్నట్టు లేదు. దెయ్యాన్ని కొన్నట్టుంది...జగతి మేడం దెయ్యంలా వచ్చారేమో సర్.." అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చాలా కొత్తగా ఉంది అని అంటున్నారు.
![]() |
![]() |